కుర్చీలో కూర్చోబెట్టి.. నీళ్లు అందించి..

by Ajay Maddhiboyina |

కాగా, ఇటీవల కాలంలో శరద్ పవర్ ఎన్డీయే పార్టీలకు దగ్గర అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేను శరద్ పవార్ సన్మానించారు.

కుర్చీలో కూర్చోబెట్టి.. నీళ్లు అందించి..
X

- శరద్‌పవార్‌తో మోడీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ(ఎస్పీ) అధినేత, పార్లమెంట్ సభ్యుడు శరద్ పవార్‌తో ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంది. వృద్ధుడైన పవార్ కుర్చీలో కూర్చోవడానికి సహకరించడమే కాకుండా, గ్లాసులో నీళ్లు పోసి అందించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సమ్మేళనం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోడీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, శరద్ పవార్‌లు ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. పవార్ ఆహ్వానం మేరకే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని మోడీ చెప్పడం విశేషం. ఇలాంటి సాంప్రదాయకపైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని మోడీ అన్నారు. కాగా, శరద్ పవార్ ప్రసంగించి తన కుర్చీ వద్దకు రాగా.. మోడీ ఆయన్ను స్వయంగా కూర్చోబెట్టారు. అంతే కాకుండా గ్లాసులో నీళ్లు పోసి అందించారు. మోడీ వ్యవహరించిన తీరు చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులు, ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ప్రశంసలు కురిపించారు. కార్యక్రమం ఆసాంతం మోడీ, పవర్ చాలా అన్యోన్యంగా మాట్లాడుకోవడం కనిపించడం గమనార్హం. కాగా, ఇటీవల కాలంలో శరద్ పవర్ ఎన్డీయే పార్టీలకు దగ్గర అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేను శరద్ పవార్ సన్మానించారు.

Next Story