ISSకు చేరిన వ్యోమగాములు.. స్పేస్ నుంచి శుభాంశు శుక్లా ఫస్ట్ మెసేజ్ ఇదే

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-26 07:53:49  IST  )

యాక్సియం-4 (Axiom-4)‌లో భాగంగా రోదసీ యాత్రకు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla)తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌ (ISS)కు చేరుకున్నారు.

ISSకు చేరిన వ్యోమగాములు.. స్పేస్ నుంచి శుభాంశు శుక్లా ఫస్ట్ మెసేజ్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్సియం-4 (Axiom-4)‌లో భాగంగా రోదసీ యాత్రకు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla)తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌ (ISS)కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్పేస్ నుంచి వ్యోమగామి శుభాంశు శుక్లా తన ఫస్ట్ మెసేజ్ పంపారు. దేశ ప్రజలకు అంతరిక్షం నుంచి ఆయన నమస్కారం తెలిపారు. రోదసీలో ఎలా వాక్ చేయాలి.. ఎలా తినాలి అనే విషయాలను ఓ చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. భారతదేశ అంతరిక్ష రంగంలో ఇది స్థిరమైన, దృఢమైన అడుగు అని అన్నారు. ISSలో ఎక్కవ టైమ్ గడిపేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. స్పేస్‌లోని తన తొలి ఎక్స్‌పీరియన్స్‌ను దేశ ప్రజలతో షేర్ చేసుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని శుభాంశు శుక్లా అన్నారు.

Next Story