Muda: ముడా కేసులో రూ. 100 కోట్ల ఆస్తుల జప్తు

by Shamantha N |   (  Updated:2025-06-10 09:34:23  IST  )

కర్ణాటకలో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణానికి సంబంధించి ఈడీ రూ. 100 కోట్లు విలువ చేసే 92 ప్రాపర్టీలను తాత్కాలికంగా జప్తు చేసింది.

Muda: ముడా కేసులో రూ. 100 కోట్ల ఆస్తుల జప్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణానికి సంబంధించి ఈడీ రూ. 100 కోట్లు విలువ చేసే 92 ప్రాపర్టీలను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 కింద జప్తు చేసినట్టు అధికారులు తెలిపారు. జప్తు చేసిన ఆస్తుల్లో ముడా సైట్లు, హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీలు, ఆయా వ్యక్తుల పేర్ల మీద ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఈ స్కాంలో ముడా అధికారుల పాత్ర ఉందని భావిస్తున్నారు. మైసూరు లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు జరగ్గా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (SIDDA RAMAYYA) పేరుతో పాటు ఆయన భార్య పేరు కూడా ఉండటం గమనార్హం.

అర్హత లేని వ్యక్తులకు స్థలాల కేటాయింపులు

ఈ కుంభకోణంలో ముడా సైట్ల కేటాయింపులో పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఈడీ (ED) తెలిపింది. ప్రభుత్వం ఆమోదించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించి, అర్హత లేని వ్యక్తులకు స్థలాలను కేటాయించినట్టు పేర్కొంది. ముడా మాజీ కమిషనర్లలో ఒకరైన జీటీ దినేశ్ కుమార్ ఈ అక్రమాల్లో ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు ఈడీ పేర్కొంది. విచారణలో మరిన్ని విషయాలు బయట పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Next Story