తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలకు ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు

by Ajay Maddhiboyina |

ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లను నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు కేర‌ళ‌, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నిక‌లు నిర్వంచాల‌నే ఆలోచ‌న‌లో ఈసీ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలకు ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు
X

దిశ, వెబ్ డెస్క్: ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లను నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు కేర‌ళ‌, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నిక‌లు నిర్వంచాల‌నే ఆలోచ‌న‌లో ఈసీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మార్చిలో షెడ్యూల్ విడుద‌ల చేసి ఏప్రిల్ లో పోలింగ్ నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్టు ఈసీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇప్ప‌టికే ఈ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త అంచ‌నా వేయడానికి అధికారులు ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం అధికారులు అస్సాంలో ప‌ర్య‌టిస్తున్నారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మేలో ప‌ద‌వీకాలాలు ముగుస్తుండ‌గా పుదుచ్చేరిలో జూన్ లో ప‌దవీకాలం ముగియ‌నుంది. ఇక ఇప్ప‌టికే ఫిబ్ర‌వరి 14న ఓట‌ర్ల జాబితా ప్ర‌చురించ‌గా, అస్సాంలో ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌చురించింది. కాగా కేర‌ళ‌లో ఫిబ్ర‌వ‌రి 21న‌, బెంగాల్ లో ఫిబ్ర‌వ‌రి 28, త‌మిళ‌నాడులో ఫిబ్ర‌వ‌రి 17న ఓట‌ర్ల తుదిజాబితాను విడుద‌ల చేయ‌నున్నారు.

Next Story