అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు.. గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌లకు చెరో సీటు

by Kema Shiva Kumar |

జూన్ 19న నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు.. గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌లకు చెరో సీటు
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 19న నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు గుజరాత్‌లో బీజేపీ, ఆప్ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. రాజేంద్ర చావ్డా (బీజేపీ) కడి నియోజకవర్గం నుంచి గోపాల్ ఇటాలియా (ఆప్) విసావదర్ సెగ్మెంట్‌లో ఘన విజయం సాధించారు. కేరళలో, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF నీలంబూర్‌ను కైవసం చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా ట్రెండ్‌ల ప్రకారం.. పంజాబ్‌లోని లూధియానా వెస్ట్‌లో ఆప్, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్‌లో తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో ఒక్కో సీటులో సిట్టింగ్ శాసనసభ్యుల మరణం, కేరళ, గుజరాత్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాల కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Next Story