- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chirang Court: జీరో పెండింగ్ కేసులతో అరుదైన ఘనత సాధించిన చిరాంగ్ కోర్టు
2024 చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను క్లియర్ చేయడం ద్వారా చిరాంగ్ కోర్టు రికార్డు సృష్టించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అరుదైన ఘనతను సాధించింది. 2024 చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను క్లియర్ చేయడం ద్వారా చిరాంగ్ కోర్టు రికార్డు సృష్టించింది. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ) ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా, సబార్డినేట్ కోర్టులలో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో చిరాంగ్ కోర్టు సున్నా పెండెన్సీ సాధించడం విశేషం. సహజంగా కోర్టుల్లో వాయిదాల పర్వం మొత్తం భారత న్యాయ వ్యవస్థనే వేధిస్తున్న అంశం. కానీ, కోర్టు విచారణలలో సుధీర్ఘ జాప్యాన్ని సూచించే ఈ ధోరణిని చిరాంగ్ కోర్టు తిప్పి కొట్టింది. 2024, డిసెంబర్ 31 నాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను చిరాంగ్ కోర్టు పరిష్కరించిందని జిల్లా కోర్టులోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నందితా బసుమతారి చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో ఈ కోర్టులో 143 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అదనంగా 687 కేసులు వచ్చాయి. ఏడాది గడిచే నాటికి మొత్తం 830 కేసులను పరిష్కరించినట్టు ఆమె తెలిపారు. ఇది మాత్రమే కాకుండా 2024, జనవరి-నవంబర్ మధ్య అస్సాంలో శిక్షా రేటు 22.68 ఉండగ, చిరాంగ్ జిల్లాలో జనవరి-డిసెంబర్ మధ్య 23.29 శాతంగా ఉంది. ఒక్క డిసెంబరు నెలలోనే జిల్లాలో నేరారోపణలు 26.89 శాతంగా నమోదయ్యాయి. అయితే, ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు, పోలీసులు, చిరాగ్ బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది సహకారంతో ఈ జీరో పెండెన్సీ ఫీట్ సాధించడం సాధ్యమైందని బసుమతారి వెల్లడించారు.






