అస్సాం టీపొడికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పేరు! ఎందుకో తెలుసా..?!

by Disha Web Desk 20 |
అస్సాం టీపొడికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పేరు! ఎందుకో తెలుసా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచ చ‌రిత్ర‌లో కొంద‌రు మాత్ర‌మే అంత‌ర్జాతీయంగా ప్ర‌జ‌లంద‌ర్నీ ప్ర‌భావితం చేయ‌గ‌లిగారు. ఓట‌మి గెలుపుల‌తో సంబంధం లేకుండా ధైర్య‌సాహ‌సాల‌కు ప్ర‌తీక‌లుగా నిలిచారు. తాజాగా అలాంటి పేరునే సంపాదించుకుంటున్నాడు ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడు వొలోడిమీర్ జెలెన్స్కీ. అంత‌ర్జాతీయ రాజ‌కీయ‌ల‌ను ప‌క్క‌కు పెట్టి, మాన‌వ‌త్వ‌పు కోణంలో ఆలోచించిన‌ప్పుడు యుద్ధం నాశ‌నాన్నే మిగిల్చుతుందన్న‌ది నిజం. అయినా, బానిస‌గా బ‌త‌క‌డం క‌న్నా విముక్తి కోసం పోరాటం చేయ‌డం అనేది స‌మ‌స‌మాజ స్థాప‌న‌లో మూలాంశం కూడా. అంత‌టి, తెగువ‌ను చూపించిన కార‌ణంగా అస్సాంకు చెందిన అరోమికా టీ స్టార్ట‌ప్‌ తేయాకు కంపెనీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు మీద టీపొడిని విడుదల చేసింది.

ఈ సంద‌ర్భంగా అరోమికా టీ డైరెక్టర్ రంజిత్ బారువా మాట్లాడుతూ 'స్ట్రాంగ్‌ అస్సాం సిటిసి టీ బ్రాండ్ 'జెలెన్స్కీ'ని ప్రారంభించామ‌ని, "యుద్ధం ప్రారంభ‌మైన కొన్ని గంట‌ల్లోనే జెలెన్స్కీని ర‌క్షించడానికి త‌మ దేశానికి తీసుకెళ్తామ‌న్న అమెరికా మాట తోసిపుచ్చిన‌, అత‌ని శౌర్యాన్ని గౌరవించడానికే జెలెన్స్కీ పేరుతో ఇలా చేశామ‌ని అన్నారు. "విజయం ఎక్కడా సమీపంలో లేదని పూర్తిగా తెలుసు, కానీ ఇప్పటికీ పోరాడుతున్నాడు. ఆ పరాక్రమానికి, ఈ అస్సాం టీకి మధ్య సారూప్యతను తెలియ‌జేయ‌డానికే ఇలా చేశాము" అని బారువా వివ‌రించారు.



Next Story

Most Viewed