- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లవ్ జిహాద్ పై చట్టం తెస్తాం : సీఎం సంచలన ప్రకటన
లవ్ జిహాద్ పై అస్సాం సీఎం సంచలన ప్రకటన చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : లవ్ జిహాద్ పై అస్సాం సీఎం సంచలన ప్రకటన చేసారు. త్వరలోనే రాష్ట్రంలో లవ్ జిహాద్, బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాలు తెస్తామని ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ ప్రకటించారు. బుధవారం ఓ కార్యక్రమంలో హిమంతబిశ్వ శర్మ.. ఈ వ్యాఖ్యలు చేసారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెడతామని మీడియాతో పేర్కొన్నారు. అలాగే
అస్సాంలోని వైష్ణవ సాంస్కృతిక కేంద్రాల పరిరక్షణతోపాటు, టీ తోటల్లో పనిచేసే ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించే చట్టాలు కూడా చేయబోతున్నట్లు తెలియజేసారు. ఈ అంశాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను రూపొందిస్తున్నామని, రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఎం వెల్లడించారు. అయితే కొన్ని మతాల్లో, తెగల్లో బహుభార్యత్వం వారి సాంప్రదాయం కాగా.. దీనిపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.






