Assam: అస్సాంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. హ్యాట్రిక్ దిశగా కాషాయ దళం!

by Kema Shiva Kumar |

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

Assam: అస్సాంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. హ్యాట్రిక్ దిశగా కాషాయ దళం!
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార బీజేపీ (BJP) కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతం బీజేపీ కూటమి మొత్తం 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ (Congress) కూటమి కేవలం 27 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. అదేవిధంగా ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా, మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 64ను బీజేపీ కూటమి ఇప్పటికే సునాయాసంగా దాటేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ, ఫలితాల్లో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు.

Next Story