Assam 2.0: అడ్వాంటేజ్ అసోం 2.0 ప్రారంభం.. భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ, అంబానీ?

by B.Srinivas |

తూర్పు భారతదేశం, ఈశాన్య ప్రాంతాలు కొత్త భవిష్యత్తుకు నాంది పలుకుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

Assam 2.0: అడ్వాంటేజ్ అసోం 2.0 ప్రారంభం.. భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ, అంబానీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు భారతదేశం, ఈశాన్య ప్రాంతాలు కొత్త భవిష్యత్తుకు నాంది పలుకుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన అసోం రాజధాని గువహటి(Guwahati)లో అడ్వాంటేజ్ అసోం 2.0 (Advantage assam 2.0) ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి వైపు పయనిస్తున్న తరుణంలో ఈశాన్య ప్రాంతం మరోసారి తన సామర్థ్యాన్ని ప్రదర్శించబోతుందని కొనియాడారు. అడ్వాంటేజ్ అసోం అనేది ప్రపంచాన్ని అసోం సామర్థ్యంతో అనుసంధానించే ప్రచారమని తెలిపారు. 2018లో సోం ఆర్థిక వ్యవస్థ రూ. 2.75 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడు అది రూ.6 లక్షల కోట్లుగా మారిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఆర్థిక వ్యవస్థ ఆరు రెట్లు వృద్ధి చెందిందని చెప్పారు. 2030 నాటికి రాష్ట్ర జీడీపీ రూ.12.44 లక్షల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

కాగా, అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ పెట్టుబడి, మౌలిక సదుపాయాలకు సంబంధించినది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా ఇందులో 14 సెషన్లు ఉన్నాయి. వివిధ ఇంటర్నేషన్ అర్గనైజషన్స్, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్, విద్యార్థులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారు. తొలి రోజు ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు ఎన్ చంద్రశేఖరన్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ప్రశాంత్ రుయా, అనిల్ అగర్వాల్, సజ్జన్ జిందాల్ వంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అనంతరం రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ కంపెనీలు రాబోయే రోజుల్లో అసోంలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. రెండో రోజు జరిగే కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.

Next Story