- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌పై మరోసారి విషంకక్కిన ఆసిమ్ మునీర్.. ఊహకందని విధంగా ప్రతిస్పందిస్తాం!
భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మరోసారి విషం కక్కారు. తాలిబన్ ప్రభుత్వంతో యుద్ధం నేపథ్యంలో భారత్‌కు వార్నింగ్స్ ఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్‌పై విషంకక్కారు. అఫ్గానిస్తాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మరోసారి యాంటీ-ఇండియా వాదనలు వినిపించారు. అబోటాబాద్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మునీర్.. అణ్వాయుధాలు ఉన్న వాతావరణంలో యుద్ధానికి తావులేదన్నారు. ‘మమ్మల్ని ఏమాత్రం రెచ్చగొట్టినా.. శత్రువుల ఊహలకు అందని విధంగా ప్రతిస్పందిస్తాం. యుద్ధంలో భౌగోళికంగా పైచేయి సాధించొచ్చు అనుకునే భారత్ నమ్మకాన్ని అత్యంత శక్తిమంతమైన మన ఆయుధాలు ముక్కలు చేస్తాయి’ అని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంపై తీవ్రమైన పరిణామాలు చూపించే రెచ్చగొట్టే చర్యల భారం భారత్‌పైనే ఉందని మునీర్ స్పష్టంచేశారు.
అదే సమయంలో అఫ్గాన్ భూభాగం నుంచి పాక్‌పై కొందరు ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారన్న ఆయన.. కొంతమంది టెర్రరిస్టులు కలిసి పాక్‌ను ఏమీ చేయలేరని, అఫ్గాన్ గడ్డపై నుంచి పాక్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రాక్సీ ముఠాలను మట్టిలో కలిపేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కశ్మీర్ సమస్యను కూడా ప్రస్తావించిన మునీర్.. అక్కడి ప్రధాన సమస్యలను అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి భారత్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇటీవల భారత్‌తో జరిగిన ఘర్షణల్లో పాక్ ఆర్మీ అద్భుతమైన ప్రొఫెషనలిజం చూపించిందని, ప్రమాదాలను ఆదిలోనే నిలువరించిందని గొప్పలు చెప్పుకున్నారు.






