- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌కు అమెరికాలో నిరసన సెగ.. డిక్టేటర్ అంటూ నినాదాలు
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు భారీ షాక్ తగిలింది. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు నిసరన సెగ ఎదురైంది.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim muneer) కు భారీ షాక్ తగిలింది. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు నిసరన సెగ ఎదురైంది. సొంత పాక్ పౌరులే ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మునీర్ డిక్టేటర్, ప్రజా హంతకుడంటూ నినాదాలు చేశారు. యూఎస్ టూర్‌లో భాగంగా మునీర్ అమెరికా వెళ్లగా ఆయన బస చేసిన హోటల్ వివరాలు తెలుసుకున్న పాక్ ప్రజలు భారీగా అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. మునీర్ పిరికివాడు, సామూహిక హంతకుడు, నియంత అని నినాదాలు చేశారు. మునీర్ పర్యవేక్షణలో పాక్ సైనిక రాజ్యంగా మారిందని, దేశంలో ప్రజల గొంతును అణచి వేస్తున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఈ నిరసనను నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, అమెరికా సైనిక కవాతుకు అసీమ్ మునీర్‌ను ఆహ్వానించారని పలు కథనాలు వెలువడగా వాటిని వైట్ హౌస్ వర్గాలు ఖండించాయి. మునీర్‌ను ఇన్వైట్ చేయలేదని తెలిపాయి. ఈ క్రమంలోనే మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే యూఎస్ ఆహ్వానం మేరకు మునీర్ అమెరికా వెళ్లలేదని, ఇతర కార్యక్రమాల నిమిత్తం వెళ్లారని తెలుస్తోంది. ఐదురోజుల పాటు ఆయన యూఎస్ పర్యటనలో ఉండనున్నట్టు సమాచారం.






