- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asif: సింధూ నదిపై నిర్మాణాలు చేపడితే పేల్చేస్తాం.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Kawaja Asif) భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం సింధూ జలాలను పాక్‌కు ఇవ్వాలని, నీటిని దారి మళ్లిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సింధు జలాలను మళ్లించడం దురాక్రమణతో సమానమని అభివర్ణించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నీటిని ఆపడానికి సింధూ నదిపై భారత్ ఏవైనా నిర్మాణాలు చేపడితే వాటిని ధ్వంసం చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలు సృష్టించడానికి ప్రయత్నించినా దాడులకు తెగబడతామని తెలిపారు. సింధూ ఒప్పందాన్ని ఉల్లంఘించడం భారత్ కు అంత సులభమైన విషయం కాదన్నారు. ఈ డీల్ పై తమ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కాగా, పహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధూ నది ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీని వల్ల పాక్ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఆందోళన చెందుతోంది.






