- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాన నగరాల్లో రైలు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాం: అశ్విని వైష్ణవ్
ప్రధాన నగరాల్లో రైలు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2030 కల్లా ఈ పనులు పూర్తిచేస్తామన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ అభివృద్ధి వేగాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రధాన నగరాల్లో రైలు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరాలను కూడా పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రధాన నగరాల్లో రద్దీని తగ్గించే లక్ష్యంతో కోచింగ్ టర్మినల్స్, సెక్షనల్-ఆపరేషనల్ సామర్థ్యాన్ని వచ్చే ఐదేళ్లలో పెంచుతామన్నారు. ఇలా చేయడం ద్వారా దేశ రైల్వే నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ అవడంతోపాటు దేశవ్యాప్తంగా కనెక్టివిటీ మెరుగవుతుందని వివరించారు.
ప్రస్తుత టర్మినల్స్‌లో అదనపు ప్లాట్‌ఫామ్స్, స్టాబ్లింగ్ లైన్స్, పిట్ లైన్స్, షంటింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే అర్బన్ ఏరియాల్లో అవసరమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ కొత్త టర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు. మెగా కోచింగ్ కాంప్లెక్సులు సహా మెయింటెనెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు.. పెరిగే రైళ్ల సంఖ్యను హ్యాండిల్ చేయగలిగేలా ట్రాఫిక్ ఫెసిలిటీ పనులు, సిగ్నలింగ్ అప్‌గ్రేడేషన్‌లు, మల్టీ ట్రాకింగ్ సెక్షనల్ కెపాసిటీని కూడా పెంచనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రక్రియను 2030లోగా పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు.






