- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్క్ జుకర్‌బర్గ్ మాటలన్నీ అబద్దాలే
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 64 కోట్ల మంది ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ఓటర్లు నమ్మకం ఉంచి మరోసారి గెలిపించారని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

- ఇండియాలో ఎన్నికలపై తప్పుడు సమాచారం
- ఖండించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
దిశ, నేషనల్ బ్యూరో:
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలన్నీ అబద్దాలేనని, తన వేదిక ద్వారా తప్పుడు సమాచారాన్ని ఆయన ధృవీకరిస్తున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ సహా ఇతర ఎన్నికల ఫలితాల విషయంలో జుకర్‌బర్గ్ చేసిన వాదనను ఆయన ఖండించారు. నిరుడు ఇండియా సహా అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని ఇటీవల జో రోగన్‌తో చేసిన పాడ్‌కాస్ట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. కాగా, జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 64 కోట్ల మంది ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ఓటర్లు నమ్మకం ఉంచి మరోసారి గెలిపించారని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కోవిడ్ అనంతరం ప్రపంచంలో పలుదేశాల్లో ప్రభుత్వాలు ఓడిపోయాయని చెప్పడం పూర్తిగా అబద్దమని ఆయన అన్నారు.
కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారం అందించామని. అలాగే 2.2 బిలియన్ల వ్యాక్సిన్లను ఉచితంగా అందించామని, అనేక దేశాలకు కోవిడ్ సమయంలో ఇండియా సహాయం అందించిందని.. ఇవన్నీ పీఎం నరేంద్ర మోడీ మూడో సారి విజయం సాధించడంలో ఉపయోగపడ్డాయని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. మెటా అధిపతి జుకర్‌బర్గ్ నుంచి ఇలాంటి తప్పుడు సమాచారం రావడంపై తాను నిరాశ చెందానని మంత్రి తెలిపారు.






