ముగిసిన అశాభోస్లే అంత్యక్రియలు

by Prasad Jukanti |

భారతీయ సంగీత లెజెండ్ ఆశా భోంస్లే (92) అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.

ముగిసిన అశాభోస్లే అంత్యక్రియలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ సంగీత ప్రపంచంలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే(92) (Asha Bhosle) అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని దాదర్లోని శివాజీ పార్క్ (Shivaji Park) శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, ప్రముఖుల అశ్రుతర్పణల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రయలు ముగిశాయి. ఛాతిలో ఇన్పెక్షన్ కారణంగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోస్లే నిన్న తుదిశ్వాస విడిచారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి తన గాంత్రంతో వన్నె తెచ్చిన ఆశాభోస్లే భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పారెల్‌లోని ఆమె నివాసంలో ఉంచారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశానవాటికకు అంతిమ యాత్ర కొనసాగింది. దారిపొడుగునా వేలాది మంది అభిమానుల చేరి తమ అభిమాన గాయనికి అంతిమ వీడ్కోలు పలికారు. పసుపు రంగు పూలతో అలంకరించిన ఆ శవపేటిక వాహనంపై, సాంప్రదాయ మహారాష్ట్ర 'నాథ్' ధరించిన గాయని యొక్క పెద్ద ఛాయాచిత్రాన్ని కూడా ఉంచారు.

Next Story