- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ తల్లికి తూటా దింపిందెవరో గుర్తులేదా? పాక్ నేతకు ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
పహల్గామ్‌లో ఈనెల 22న పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్‌లో ఈనెల 22న పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి భారతీయులపై నోరు పారేసుకున్నారు. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలి లేదా భారతీయుల రక్తం పారాలి అంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. భుట్టో మాటలు చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ఆయన తల్లి, తాతను కూడా ఉగ్రవాదులే చంపారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ విషయం మర్చిపోయి భుట్టో ఇలా మాట్లాడుతున్నారని లేకపోతే ఉగ్రవాదులను నాశనం చేసేందుకు కృషి చేసేవారని అన్నారు. అసలు పాకిస్థాన్‌కు అమెరికా సాయం చేయకపోతే వాళ్లు దేశాన్ని కూడా నడపలేరని ఆరోపించారు. అలాంటి వాళ్లు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారని అణ్వాయుధాలతో బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తే ఎవరు అధికారంలో ఉన్నా మౌనంగా ఉండరని గట్టిగా బదులిస్తారని హెచ్చరించారు.






