- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విపక్షాల చేతకాని తనం వల్లే బీజేపీకి విజయాలు: అసదుద్దీన్ ఓవైసీ
విపక్షాల చేతకాని తనం వల్లే బీజేపీకి విజయాలు దక్కుతున్నాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: విపక్షాల చేతకానితనం వల్లనే బీజేపీ వరుసగా విజయాలు సాధిస్తోందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓవైసీ పార్టీని ‘బీజేపీ-బీ పార్టీ’ అంటూ పలుమార్లు విపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ.. విపక్షాలు తనను తప్పుబట్టడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీపై ద్వేషం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఆయన తేల్చిచెప్పారు. ‘విపక్షాలు చేతకానివి కాబట్టే బీజేపీ గెలుస్తోంది. వాళ్లు 50 శాతం హిందూ ఓట్లను వాళ్లి పొందుతున్నారు’ అని ఓవైసీ అన్నారు.
‘అలాంటప్పుడు నన్ను తప్పుబట్టడం ఎంత వరకు సమంజసం? 2024 ఎన్నికల్లో హైదరాబాద్, ఔరంగాబాద్, కిషన్‌గంజ్ వంటి కొన్ని సీట్లలో మాతమ్రమే మా పార్టీ నిలబడింది. బీజేపీకి 240 సీట్లొచ్చాయి. అలాంటప్పుడు వారి విజయానికి మేం ఎలా కారణం అవుతాం?’ అని ఆయన నిలదీశారు. దేశంలో అన్ని వర్గాలకు రాజకీయ నాయకత్వం ఉందని, దాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయని చెప్పిన ఓవైసీ.. ఒక్క ముస్లింలకు మాత్రం రాజకీయంగా గొంతు ఉండకూడదని అనుకోవడం సరికాదని హితవు పలికారు. తాను ఏదో ఒక పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, కాంగ్రెస్, బీజేసీ, బీఎస్పీ, ఎస్పీ ఇలా అన్ని పార్టీలను తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు.






