ట్రంప్‌కు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇందుకేనా?.. పాక్‌కు ఓవైసీ చురకలు

by Phanindra |

ట్రంప్‌కు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇందుకేనా? ఇరాన్‌పై యూఎస్ దాడి చేయడంతో పాక్‌కు ఓవైసీ చురకలు వేశారు.

ట్రంప్‌కు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇందుకేనా?.. పాక్‌కు ఓవైసీ చురకలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌పై యూఎస్ దాడుల నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పాకిస్తాన్‌ను టార్గెట్ చేసిన ఆయన.. ఇలా బాంబులు వేస్తున్నందుకే ట్రంప్‌ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారా? అని చురకలేశారు. అలాగే ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీని కూడా విమర్శించారు. ‘ఇప్పుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలా? అని పాకిస్తాన్‌ను అడగండి. ఈ దాడుల కోసమే ట్రంప్‌తో ఆసిమ్ మునీర్ లంచ్ చేశారా? పాక్ అబద్ధాలన్నీ ఈరోజుతో బట్టబయలయ్యాయి’ అని ఓవైసీ చెప్పారు.


అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ‘పాలస్తీనియన్ల హంతకుడు’గా అభివర్ణించిన ఓవైసీ.. ‘యూఎస్ చేసిన దాడులు పాలస్తీనియన్ల హంతకుడైన నెతన్యాహుకు కలిసొచ్చాయి. తను చేస్తున్న ఘాతుకాలను దీంతో కప్పిపుచ్చుకునే అవకాశం కలిగింది. సుమారు 55 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. కానీ యూఎస్ ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు’ అని అన్నారు. ఇరాన్‌లో అణుబాంబులు ఒక బూటకం అన్న ఆయన.. లిబియా, ఇరాక్‌లో కూడా ఇదే కారణం చూపించారని, కానీ చివరకు అక్కడ ఏం లేవని తేలిందని గుర్తుచేశారు.

Next Story