- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. ఇండియాలో పెరుగనున్న విమాన టికెట్ ధరలు!
భారత్ వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య యుద్ధం ( War ) వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... విమాన ప్రయాణికులకు ( F

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య యుద్ధం ( War ) వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... విమాన ప్రయాణికులకు ( Flight Travel ) ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో... ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. అలాగే ప్రయాణ సమయం కూడా పెరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో ( pahalgam attack ) పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 28 మంది టూరిస్టులు మరణించారు.
దీనిపై ప్రతికార చర్యకు దిగుతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే అటు పాకిస్తాన్ కూడా తగ్గేదే లేదంటూ వ్యవహరిస్తోంది. ఇండియా నుంచి వచ్చే విమానాలు తమ దేశం గగనతలంపై నుంచి... ఎగిరేది లేదని నిషేధం విధించింది పాకిస్తాన్. దీంతో ఉత్తర భారతదేశం నుంచి ప్రయాణికులకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. విమానాలు ఎగరడంపై పాకిస్తాన్ నిషేధించడంతో... విమాన టికెట్ ధరలు 8 శాతం నుంచి 12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి యూరప్, నార్త్ అమెరికా అలాగే మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకనుంచి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. అలా విమానాలు ప్రయాణిస్తే ఖర్చుల భారం ప్రయాణికులపై అధికంగా పడనుంది. అలాగే ప్రయాణ సమయం కూడా 3 గంటలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. టికెట్ ధరలు దాదాపు 12 శాతం వరకు పెరిగే ఛాన్సులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ విషయం వైరల్ కావడంతో ప్రయాణికులు.. ఉలిక్కి పడుతున్నారు.






