Delhi election results: ఆప్ ఓటమి వేళ.. స్వాతి మలివాల్ పోస్టు వైరల్..

by Shamantha N |

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో (Delhi election results) ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) ఓటమి పాలైంది. కాగా.. కేజ్రీవాల్‌ సహా ఆప్ ఓటమి వేళ.. ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ (Swati Maliwal) పోస్టు వైరల్ గా మారింది.

Delhi election results: ఆప్ ఓటమి వేళ.. స్వాతి మలివాల్ పోస్టు వైరల్..
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో (Delhi election results) ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) ఓటమి పాలైంది. కాగా.. కేజ్రీవాల్‌ సహా ఆప్ ఓటమి వేళ.. ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ (Swati Maliwal) పోస్టు వైరల్ గా మారింది. సోషల్ మీడియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా మహాభారతంలో కౌరవుల సభలో ‘ద్రౌపది వస్త్రాపహరణం’కు సంబంధించిన ఫొటో షేర్‌ చేశారు. కాగా.. ప్రస్తుతం స్వాతి మలివాల్‌ పోస్టు వైరల్ గా మారింది. కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ కీలక నేతలు ఓటమి బాట పట్టారు. న్యూఢిల్లీ స్థానంలో పోటీ చేసిన కేజ్రీవాల్‌.. 3వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓటమిపాలయ్యారు. మనీశ్‌ సిసోడియా, సత్యేందర్ జైన్‌ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు.

స్వాతి మలివాల్ వివాదం..

ఇదిలా ఉండగా.. ఆప్‌ మహిళా ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal PA Bibhav Kumar) గతంలో దాడికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బిభవ్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, పలుమార్లు కొట్టాడని ఆమె ఆరోపించారు. అప్పట్నుంచి ఆప్ పార్టీతో స్వాతి మలివాల్‌కు విభేదాలు తలెత్తాయి. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ తో స్వాతి మలివాల్ కు విభేదాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్‌తో విభేదాలను పరిష్కరించుకోకుండా హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేయడం ద్వారా కేజ్రీవాల్ ప్రతిపక్ష ఇండియా కూటమికి ద్రోహం చేశారని ఆరోపించారు. దీంతో కూటమి నుండి ఓట్లను మళ్లించారని మలివాల్ వెల్లడించారు. మరోవైపు, ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ నివాసం వెలుపల ఆమె నిరసన చేప్టటారు. యమునా నదిని శుభ్రం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసమయంలో స్వాతి మలివాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆప్ ఓటమి వేళ ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం.

Next Story