- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవి దేవుడు ఇస్తున్న ప్రసాదాలు.. బీజేపీ మేనిఫెస్టోపై కేజ్రివాల్ వ్యంగ్యాస్త్రాలు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడంపై బీజేపీ గతంలో ఘాటైన విమర్శలు చేసింది.

- ఉచితాలపై మాట వెనక్కు తీసుకోవాలని మోడీకి డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఉచితాలు దేశానికి హానికరం కాదని బీజేపీ ఒప్పుకోవాలి. అవి దేవుడి ప్రసాదాల వంటివి అని అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో పలు ఉచిత పథకాలను అందిస్తామని ఆ పార్టీ పేర్కొంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడంపై బీజేపీ గతంలో ఘాటైన విమర్శలు చేసింది. అయితే తాజాగా బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఉచితాలు ప్రకటించడంపై అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు. 'బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తన లాగే ఉచిత పథకాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉచిత పథకాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తప్పని వెంటనే ఒప్పుకోవాలి' అని కేజ్రివాల్ డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్, తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చి గత ఎన్నికల్లో కేజ్రివాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ప్రధాని మోడీ ఈ ఉచితాలను తప్పుబట్టారు. ఉచితాలు దేశానికి మంచివి కావని మోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, మోడీ తన తప్పును ఒప్పుకోవాలని కేజ్రివాల్ డిమాండ్ చేశారు.






