- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Haryana CM: మాటలు చెప్పడమే కానీ.. చేతలు లేవు- కేజ్రీవాల్ పై హర్యానా సీఎం విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) హర్యానా ముఖ్యమంత్రి (Haryana CM) నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) హర్యానా ముఖ్యమంత్రి (Haryana CM) నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో.. ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కేజ్రీవాల్ తన వైఫల్యాలకు ఇతరుల్ని బాధ్యులు చేస్తుంటారని ఆరోపించారు. ‘‘కేజ్రీవాల్ మాటలు చెప్పడమే కానీ చేతలు చేయలేదు. తన వైఫల్యాలకు ఇతరులను బాధ్యుల్ని చేస్తుంటారు. 2025 నాటికి యమునా నదిని శుభ్రం చేయలేకపోతే.. ఓట్లు అడగనంటూ గతంలో చెప్పారు. ఇప్పుడు ఏం చేయలేక హర్యానా సర్కారుపై నిందలు మోపారు. ఇప్పుడు చేసేది లేక హర్యానా ప్రభుత్వంపై నిందలు మోపారు. విషం కలిపారంటూ ఆరోపణలు చేశారు. ఆయన మోసాన్ని ప్రజలు అర్థం చేసుకుని బీజేపీకి అవకాశం కల్పించారు’’ అని సైనీ అన్నారు.
బీజేపీ గెలుపుపై సంతోషం
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై సైనీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు పట్టంకట్టారు. తమ అభివృద్ధి కోసం 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీకి (BJP) అధికారమిచ్చారు. ఢిల్లీ చరిత్రలోనే ఇదో చారిత్రాత్మక తీర్పు. కేజ్రీవాల్ పార్టీ తప్పుడు హామీలతో ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని నడిపింది. యమునా నదిని శుభ్రం చేస్తానన్న మాట నిలబెట్టుకోలేదు. స్వచ్ఛమైన నీటిని అందించలేకపోయారు. ప్రజల అభివృద్ధి కోసం మోడీ సర్కార్ తీసుకొచ్చిన పథకాలను అమలు చేయకుండా అడ్డుకున్నారు’’ అంటూ కేజ్రీవాల్ పై సైనీ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 48 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన కేజ్రీవాల్.. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆప్‌లోని కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే సైనీ ఈ వ్యాఖ్యలు చేశారు.






