లిప్‌స్టిక్, బాబ్ కట్ హెయిర్‌ ఉన్న ఆడవాళ్లకే మహిళా రిజర్వేషన్.. ఆర్టేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

by Bhoopathi Nagaiah |

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు నిన్న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే.

లిప్‌స్టిక్, బాబ్ కట్ హెయిర్‌ ఉన్న ఆడవాళ్లకే మహిళా రిజర్వేషన్.. ఆర్టేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు నిన్న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో లిప్‌స్టిక్‌లు, బాబ్ కట్ హెయిర్‌స్టైల్‌తో ఉన్న మహిళలకు మాత్రమే ఉపయోగపడుతాయని అన్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధిఖీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. లిప్‌స్టిక్‌లు, బాబ్‌ కట్‌ హెయిర్‌స్టైల్‌తో ఉన్నవారు మహిళా రిజర్వేషన్ల పేరుతో ముందుకు వస్తారని, ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు టెలివిజన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తన మద్దతుదారులకు సూచించారు.

Next Story