- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు అగ్రనేత ఆశన్న రాక.. జగ్దల్‌పూర్‌లో పిన్‌డ్రాప్ సైలెన్స్
‘ఆపరేషన్ కగార్’తో కకావికలం అవుతోన్న మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్’తో కకావికలం అవుతోన్న మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత, పోలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, 61 మంది కేడర్‌తో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ విషయం మరువక ముందే తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్, 70 మంది పార్టీ కేడర్లు రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో ఆయుధాలతో సరెండర్ కానున్నారు. అయితే ఇప్పటికే ఆశన్న టీమ్ రెండు ప్రత్యేక బస్సుల్లో జగ్దల్‌పూర్‌కు చేరుకుంది. దీంతో నిత్యం ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లే ఆ ప్రాంతంలో పిన్‌డ్రాప్ సెలెన్స్ చోటుచేసుకుంది. రాత్రికి అక్కడే బస చేశాక ఉదయం 11 గంటలకు సీఎం ప్రెస్‌మీట్‌లో సీఎం విష్ణుదేవ్ సాయ్‌కి ఆశన్న టీమ్ తమ ఆయుధాలు అందజేసి జనజీవన స్రవంతిలో కలువనున్నారు.






