Arrested: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. మరొక నిందితుడు అరెస్ట్

by Kema Shiva Kumar |

ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట వద్ద ఉగ్రమూకలు జరిపిన బాంబ్ బ్లాస్ట్‌లో అనూహ్యంగా మరో అనుమానిత కారు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Arrested: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. మరొక నిందితుడు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట వద్ద ఉగ్రమూకలు జరిపిన బాంబ్ బ్లాస్ట్‌లో అనూహ్యంగా మరో అనుమానిత కారు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. డాక్టర్ ఉమర్ (Dr.Umar) పేరుపై రిజిస్టర్ అయిన ఫోర్డు కారు (రిజిస్ట్రేషన్ నెం.DL 10 CK 0458)ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ఖాండ్వాలీ గ్రామం దగ్గర పార్క్ చేసి ఉండగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారును సీజ్ చేసి ఢిల్లీకి తరలించారు. తాజాగా, ఖాండ్వాలీ (Khandwali)లో కారును పార్క్ చేసిన వ్యక్తిని ఫహీమ్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉగ్రకుట్ర ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్‌కు సమీప బంధువని తెలుస్తోంది.

Next Story