Shakib : షకీబ్ పై అరెస్ట్ వారెంట్ జారీ

by M.Rajitha |
Shakib : షకీబ్ పై అరెస్ట్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh) ఆల్ రౌండర్, ఎంపీ షకీబ్ అల్ హాసన్(Shakib Al Hassan) కు భారీ షాక్ తగిలింది. ఓ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఢాకా కోర్ట్. ఐఎఫ్ఐసీ(IFIC) బ్యాంక్ కు చెందిన 3 లక్షల డాలర్ల చెక్ బౌన్స్ కేసులో షకీబ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అవడం సంచలనం సృష్టిస్తోంది. అయితే అంతకముందు ఇచ్చిన నోటీసులకు షకీబ్ సమాధానం ఇవ్వకపోవడం వలనే కోర్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక క్రికెట్ లోనూ షకీబ్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల అతని బౌలింగ్ పై ఐసీసీ(ICC) నిషేధం విధించింది. ఇక బంగ్లాదేశ్ లో షేక్ హసీనా(Shek Haseena) ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి షకీబ్ విదేశాల్లో ఉంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed