Baba Ramdev : బాబా రాందేవ్ పై అరెస్ట్ వారెంట్

by Muthe.Rajitha |

బాబా రాందేవ్(Baba Ramdev) పై కేరళ కోర్ట్ అరెస్ట్(Arrest Warrent) వారెంట్ జారీ చేసింది.

Baba Ramdev : బాబా రాందేవ్ పై అరెస్ట్ వారెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : బాబా రాందేవ్(Baba Ramdev) పై కేరళ కోర్ట్ అరెస్ట్(Arrest Warrent) వారెంట్ జారీ చేసింది. రాందేవ్ తోపాటు పతంజలి(Patnajali) ఆయుర్వేద ఉత్పత్తుల ఎండీ ఆచార్య బాలకృష్ణ(Acharya Balakrishna)పై కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ(Divya Pharmacy) ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేస్తోందని కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. పలు మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ చేస్తున్న ప్రకటనలు సత్యదూరమని ఈ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో హాజరు కావాలని కోర్ట్ పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఎటువంటి స్పందన లేకపోవడంతో.. కోర్ట్ వారి ఇరువురిపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Next Story