Arrested: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ అరెస్ట్.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-25 07:45:01  IST  )

‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Arrested: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ అరెస్ట్.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ (Medha Patkar)ను ఇవాళ ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi Lieutenant Governor VK Saxena) పెట్టిన పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లను సమర్పించినందుకు కోర్టు ఆమెపై రెండు రోజుల క్రితం నాన్-బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మేధా పాట్కర్‌ను అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) రవి కుమార్ సింగ్ (Ravi Kumar Singh) తెలిపారు.

అయితే, మేధా పాట్కర్‌ను ఇవాళ మధ్యాహ్నం సాకేత్ కోర్టు (Saketh Court)లో హాజరుపరిచే అవకాశం ఉంది, కానీ జడ్జి అజ్‌సింగ్ (Azsingh) సెలవులో ఉన్నందున.. ఆమెను మరో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, వీకే సక్సేనా ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా సమయంలో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేధా పాట్కర్ తన వ్యక్తిత్వా్న్ని కించపరిచేలా మాట్లాడారని, అదేవిధంగా పత్రికా ప్రకటక జారీ చేశారంటూ 2000ల సంవత్సరంలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి.

Next Story