- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arrest: పీఎన్‌బీ స్కామ్‌లో కీలక పరిణామం.. వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ (Punjab National Bank Scam) కేసులో కీలక నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు.

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ (Punjab National Bank Scam) కేసులో కీలక నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. సీబీఐ (CBI) అధికారుల అభ్యర్థన మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లుగా బెల్జియం పోలీసులు (Belgium Police) ఇవాళ ప్రకటించారు. 2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ (Punjab National Bank Scam)లో మెహుల్ ఛోక్సీతో పాటు ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ (Nirav Modi) విదేశాలకు పారిపోయారు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ దర్యాప్తులో భాగంగా వారు దాదాపు రూ.13,500 కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లుగా అభియోగాలు కూడా నమోదు చేశారు. అదేవిధంగా వారిపై ముంబై హైకోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది.
ఈ క్రమంలోనే బెల్జియంలో మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) తలదాచుకున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. నిందితుడిని తమకు అప్పగించాలని సీబీఐ (CBI) అభ్యర్థన మేరకు అతడిని శనివారం రాత్రి బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే అతడిని భారత్‌కు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇదే కేసులో మరో నిందితుడు, ఛోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ (Nirav Modi)ని లండన్ (London) నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs of India) తీవ్ర ప్రయత్నం చేస్తోంది.






