Fighter Jet: పంట పొలాల్లో కుప్పకూలిన ఆర్మీ విమానం

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-04 12:52:03.0  )
Fighter Jet: పంట పొలాల్లో కుప్పకూలిన ఆర్మీ విమానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఆగ్రా సమీపంలో ఆర్మీ విమానం(Army Plane) కుప్పకూలింది. సాంకేతిక కారణాలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(Indian Air Force)కు చెందిన మిగ్-29 ఫైటర్ జెట్(MiG-29 fighter jet) సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్(Pilot) సహా మరో వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. జెట్ నేలకూలుతుందని గ్రహించిన వారిద్దరూ అందులోంచి కిందకు దూకేశారు. ఆ వెంటనే జెట్ పంట పొలాల్లో కుప్పకూలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలంలో గుమిగూడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story