- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : స్తంభానికి కట్టేసి ఆర్మీ జవాన్‌పై టోల్‌గేట్ సిబ్బంది దాడి (వీడియో)
స్తంభానికి కట్టేసి ఆర్మీ జవాన్‌పై టోల్‌గేట్ సిబ్బంది దాడి ఘటన కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్మీ జవాన్ పై టోల్ గేట్ విచక్షచరహితంగా దాడికి (Army jawan attacked) పాల్పడటం కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఆలస్యాన్ని ప్రశ్నించినందుకు స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ టోల్ గేట్ (Meerut toll gate) వద్ద చోటు చేసుకుంది. కపిల్ కవాద్ అనే సైనికుడు ఇండియన్ ఆర్మీలో రాజ్ పుత్ రెజిమెంట్ లో పని చేస్తున్నాడు. ఇటీవల సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఆయన నిన్న సాయంత్రం తిరిగి విధుల్లో చేరేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి తన బంధువులతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో మీరట్ టోల్ గేట్ వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. తన విమానానికి ఆలస్యం అవుతుందనే ఆందోళనతో ఉన్న కపిల్.. కారు దిగి టోల్ సిబ్బందితో ఆలస్యంపై ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోగా కపిల్ కవాద్ ను అతని బంధువులను టోల్ సిబ్బంది దారుణంగా కొట్టారు. కపిల్ ను పట్టుకుని అతని రెండు చేతులు టోల్ గేట్ కు ఉన్న స్థంబానికి వెనక్కి లాగి పట్టుకుని కర్రతలో విచక్షణరహితంగా దాడికిపాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కపిల్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోల ఆధారంగా నలుగురు టోల్ సిబ్బందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు మరో రెండు పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.






