- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేపాల్‌లో ఆర్మీ కర్ఫ్యూ.. జెన్-Z ప్రధాన డిమాండ్లు ఇవే
నేపాల్ లో సోషల్ మీడియాపై విధించిన బ్యాన్.. జెన్-Z నిరసనలకు (Nepal Gen-Z Protesters) ప్రధాన కారణమైంది. నిరసనలతో నిన్న పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు.

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ లో సోషల్ మీడియాపై విధించిన బ్యాన్.. జెన్-Z నిరసనలకు (Nepal Gen-Z Protesters) ప్రధాన కారణమైంది. నిరసనలతో నిన్న పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు. అలాగే మాజీ ప్రధాని భార్య మరణానికి కూడా ఈ నిరసనలే కారణమయ్యాయి. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం రావడంతో ఆర్మీ (Nepal Army) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఆర్మీ ఆధీనంలోకి వస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఖాట్మండులో పహారా కాస్తున్న సైనికులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు.
ఇక నేపాల్ యువతరం ఆ దేశ పాలనలో మార్పులను కోరుకుంటోంది. కొత్త రాజకీయ వ్యవస్థతోనే దేశంలో శాంతి నెలకొంటుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేసింది. అలాగే మూడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు చేసిన అవినీతిపై సమూలంగా దర్యాప్తు జరిపించాలని, ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయినవారిని అమరులుగా ప్రకటించాలని జెన్-Z ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.






