Army chief: హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం పాకిస్థానీలే.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాకిస్థాన్ పౌరులేనని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.

Army chief: హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం పాకిస్థానీలే.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir) లో హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాకిస్థాన్ పౌరులేనని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు. చైనా సరిహద్దు వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదం నుంచి పర్యాటకం వైపు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నామని, అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో క్రియాశీలకంగా పని చేస్తున్న ఉగ్రవాదుల్లో 80 శాతం మంది పాకిస్థానీలేనని స్పష్టం చేశారు. తూర్పు లడఖ్‌లోని దేప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో చాలా వరకు పరిస్థితిని చక్కదిద్దామని చెప్పారు. ఈ రెండు ఉప-సెక్టార్‌లలో పెట్రోలింగ్ ప్రారంభమైందని తెలిపారు. వాస్తవ నియంత్రణ రేఖ (LAC)తో పాటుగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎల్ఏసీ వెంబడి బఫర్ జోన్‌లు లేవని నొక్కి చెప్పారు. మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయని, అయితే శాంతిని నెలకొల్పేందుకు భద్రతా దళాలు కృషి చేస్తున్నాయన్నారు.

Next Story