- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊర్లో సీఎం పర్యటన.. బ్యాంకును దోచేసిన దుండగులు
మంగళూరులో సీఎం సిద్దరామయ్య పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా సరే దొంగలు బ్యాంకులో చోరీకి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.

- మంగళూరులో కోఆపరేటీవ్ బ్యాంకులో భారీ చోరీ
- రూ.12 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరణ
- తక్షణ విచారణకు సీఎం సిద్దరామయ్య ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో:
కర్ణాటకలోని మంగళూరులో భారీ చోరీ చోటు చేసుకుంది. కోటేకర్ కోఆపరేటీవ్ బ్యాంకులోకి శుక్రవారం పట్టపగలే ఆరుగురు దుండగులు తుపాకులతో ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి సుమారు రూ.12 కోట్ల విలువైన బంగారం, నగదును దోచుకొని కారులో పారిపోయారు. నలుపు రంగు ఫియట్ కారులో వచ్చిన ఆరుగురు దుండగుల్లో ఐదుగురు గన్స్‌తో బ్యాంకులోకి ప్రవేశించి బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. బ్యాంకు సిబ్బంది నుంచి లాకర్ నుంచి రూ.12 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకొని పోయారు. దుండగులు బ్యాంకులోకి ప్రవేశించిన సమయంలో ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరలో ఒకరు సీసీ కెమేరా టెక్నీషియన్ అని పోలీసులు చెప్పారు. బ్యాంకులోని సీసీ కెమేరాలు మరమ్మతుకు గురి కావడంతో సదరు టెక్నీషియన్‌ను పిలిపించారు. కాగా, దుండగులు ఆ టెక్నీషియన్ ఉంగరాన్ని కూడా దోచుకొని పోయినట్లు తెలిసింది. ఉదయం 11.20 నుంచి 12.30 మధ్యలో దోపిడీ జరిగిందని, దుండగుల వయసు 25 నుంచి 35 వరకు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మంగళూరులో సీఎం సిద్దరామయ్య పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా సరే దొంగలు బ్యాంకులో చోరీకి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న సీఎం సిద్ద రామయ్య వెంటనే విచారణకు ఆదేశించారు. ఇంత మంది పోలీసులు ఉండగా.. చోరీ ఎలా జరిగిందని పోలీసులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేవారు. వెంటనే టోల్ బూత్స్ అన్నింటి వద్ద సెక్యూరిటీ పెంచాలని, సీసీ కెమేరాలు పరిశీలించి దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన ఆదేశించారు. కాగా, ఇది కర్ణాటకలో 24 గంటల్లో జరిగిన రెండో రాబరీ కావడం గమనార్హం.






