- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Argentina: డబ్లూహెచ్ఓ నుంచి అర్జెంటీనా అవుట్.. ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) నుంచి వైదొలగుతున్నట్టు అర్జెంటీనా బుధవారం ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగుతున్నట్టు అర్జెంటీనా (Argentina) బుధవారం ప్రకటించింది. కొవిడ్ మహమ్మారిని సరిగా నియంత్రించకపోవడం, ఇతర కారణాల వల్ల అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లె ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన కార్యాలయ ప్రతినిధి మాన్యుయెల్ అడోర్ని వెల్లడించారు. డబ్లూహెచ్ఓ స్వతంత్రంగా పని చేయడం లేదని, దాని నిర్ణయాలు బాహ్య ఒత్తిడికి లోబడి ఉంటాయని ఆరోపించారు. అర్జెంటీనా ఏ అంతర్జాతీయ సంస్థను తన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోదని స్పష్టం చేశారు. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన కొవిడ్ టైంలో డబ్లూహెచ్‌ఓ సరిగా పని చేయలేదని తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ డబ్లూహెచ్ఓ నుంచి యూఎస్ వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కరోనా మహమ్మారి, ఇతర ప్రపంచ సంక్షోభాలను ఆరోగ్య సంస్థ సరిగ్గా నిర్వహించలేకపోయిందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా సైతం బయటకురావడం గమనార్హం.






