'హిమాలయాలకు వెళ్తున్నావా'

by Ajay Maddhiboyina |

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి ప్రత్యేకంగా చూస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సమానంగా పవన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

హిమాలయాలకు వెళ్తున్నావా
X

- ఏపీ డీప్యూటీ సీఎం పవన్‌తో మోడీ సరదా వ్యాఖ్య

- ఎన్డీయే నేతలతో ఉత్సాహంగా కనిపించిన ప్రధాని

- ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో సరదా సన్నివేశం

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాంలీలా మైదానం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడుతూ కనిపించారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చేసిన సరదా సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి వచ్చిన పవన్‌ను చూసి.. 'ఏంటీ.. హిమాలయాలకు ఏమైనా వెళ్తున్నావా?' అంటూ మోడీ జోకులు వేశారు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. 'ప్రధాని మోడీ నాతో ఎప్పుడూ సరదాగా జోక్స్ వేస్తుంటారు. ఈ రోజు నా దుస్తులు, ఆహార్యాన్ని చూసి.. అన్నీ వదిలి హిమాలయాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నావా? అని అడిగారు. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంకా చేయవలసిన పని చాలా ఉందని చెప్పినట్లు'అని పవన్ మీడియాకు వెల్లడించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి ప్రత్యేకంగా చూస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సమానంగా పవన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Next Story