- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: నెక్స్ట్ మీ సంగతి చూస్తా.. ప్రపంచ దేశాలను ఆదోళన పెట్టిస్తున్న ట్రంప్ తాజా హెచ్చరికలు
వెనిజులా అధ్యక్షుడి నిర్భందం తర్వాత ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చర్యలు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక సమీకరణాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న దౌత్య నీతి, విదేశాంగ విధానం టెన్షన్ పెట్టిస్తున్నాయి. తాను అనుకున్నది సాధించుకునేందుకు ప్రపంచ పెద్దన్న అనుసరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యంలోకి నెట్టుతున్నాయి. ఈ క్రమంలో వెనిజులాపై సైనిక చర్యల తప్పదని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న ట్రంప్ చివరకు అన్నంత పనిచేశారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ (Oparation Absolute Resolve) పేరుతో అమెరికా సైన్యం చేపట్టిన సైనిక ఆపరేషన్‍లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో (Venezuela Nicolas Maduro) , ఆయన భార్య సిలోయో ఫ్లోరెస్‍ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో వెనిజులా అధ్యక్షుడి నిర్భందం తీవ్ర దుమారం రేపుతున్న వేళ ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్‍ను సైతం ఫిక్స్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
మీ పని కూడా చూస్తాం:
వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతులను నిర్భందించి న్యూయార్క్ జైలుకు తరలించిన మరుసటి రోజు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను షాక్‍కు గురి చేస్తున్నాయి. మదురో అరెస్టు విషయాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో (Colombia President Gustavo Petro) ఖండింస్తూ వాషింగ్టన్ చర్యను లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించాడు. ఈ మాటలు ట్రంప్‍కు కోపం తెప్పించినట్లున్నాయి. దీంతో పెట్రో వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. కొలంబియా అధ్యక్షుడిని ఉద్దేశించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అతను (పెట్రో) కొకైన్ తయారు చేస్తున్నాడు. వాటిని అమెరికాకు పంపిస్తున్నాడు. ఇక మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి అని ఆయనకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొలంబియాలోని డ్రగ్ తయారీ కేంద్రాలపై కూడా దాడులు చేసే అవకాశాన్ని తాను కొట్టిపారేయలేనని ట్రంప్ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో ఇప్పుడు కొలంబియా అధ్యక్షుడిని టార్గెట్ చేయడం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. కొలంబియాతో ఆగకుండా మెక్సికో (Mexico), క్యూబాల (Cuba) పట్ల కూడా తన ఆలోచనలను ట్రంప్ బయటపెట్టారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మంచి మహిళే, కానీ దేశాన్ని ఆమె కాకుండా డ్రగ్ కార్టెల్స్ నడుపుతున్నాయి. కార్టెల్స్‌ను ఏరివేయడానికి మేము సహాయం చేస్తామన్నా ఆమె వద్దంటున్నారుని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా తర్వాత తర్వాతి లక్ష్యం క్యూబా కావొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. క్యూబా విషయంలో ట్రంప్ సర్కార్ లోని మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు యూఎస్ నెక్స్ట్ టార్గెట్ గా కొలంబియా, మెక్సికో, క్యూబా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
తెరపైకి జెలెన్ స్కీ, పుతిన్ వ్యవహారం:
వెనిజులా అధ్యక్షుడు మదురో నిర్భంధం నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ వార్ పై చర్చ జరుగుతోంది. వెనిజులాపై మెరుపుదాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్థించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టుపై జెలెన్‍స్కీ స్పందిస్తూ నియంతలను ఈ రకంగా ఎదుర్కోవడం సాధ్యమైతే తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ లో పుతిన్ కూడా ఉన్నారా అనే చర్చ ప్రపంచ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే వెనిజులాపై అమెరికా సైనిక చర్య పట్ల అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, భారత సంతతికి చెందిన రోఖన్నా తీవ్రంగా ఖండించారు. ట్రంప్ తాజా చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ధోరణులకు దారితీస్తాయని హెచ్చరించారు. వెనిజులా విషయాన్ని ఆయన యుద్ధ చర్యగా అభివర్ణించారు. అలాగే తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ తెను చైనా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‍స్కీని రష్యా నిర్బంధిస్తే ఏం చేస్తారని రోఖన్నా నిలదీశారు. మొత్తంగా లాటిన్ అమెరికా దేశాలపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు ఏళ్ల తరబడి కొరకరాని కొయ్యలుగా మారిన వాటిల్లో వెనిజులా ఒకటి అయితే మరొకటి క్యూబా. వీటిలో వెనిజులా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసిన యూఎస్ నెక్స్ట్ క్యూబా, మెక్సికోను సైతం టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆయన మొండి వైఖరితో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది అనేది సర్వత్రా టెన్షన్ పెట్టిస్తోంది.






