ఉద్యోగులారా.. సెలవులు ఎక్కువగా వాడుతున్నారా?

by Naga Rani Yarlagadda |

2026లో చాలా పండుగలు లాంగ్ వీకెండ్స్ తో కలిసొచ్చాయి. ఉదాహరణకు మార్చి 19న ఉగాది, 21న రంజాన్ పండుగలు వచ్చాయి.

ఉద్యోగులారా.. సెలవులు ఎక్కువగా వాడుతున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: 2026లో చాలా పండుగలు లాంగ్ వీకెండ్స్ తో కలిసొచ్చాయి. ఉదాహరణకు మార్చి 19న ఉగాది, 21న రంజాన్ పండుగలు వచ్చాయి. ఆదివారం సెలవు. శుక్రవారం ఒక్కరోజు లీవ్ తీసుకుంటే.. నాలుగురోజులపాటు ట్రిప్ కు వెళ్లడమో.. పిల్లలతో కలిసి సొంతూరికి వెళ్లిరావడమో చేయవచ్చని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రైవేట్ ఉద్యోగుల్లో సెలవులను ఎక్కువగా వాడుకుంటే తమ ఉద్యోగం పోతుందేమోనన్న భయం కూడా ఉంటుంది. ఈ విషయంపై భారతీయ కార్మిక చట్టాలు (India Labour Law) ఏం చెప్తోంది?

భారతీయ కార్మిక చట్టాలప్రకారం.. అనారోగ్యం, ఇతర కారణాలతో సెలవులు ఎక్కువగా తీసుకుంటున్నారన్న కారణం చూపి ఒక ఉద్యోగిని తొలగించడం అంత ఈజీ కాదు. ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఉద్యోగిని నేరుగా తొలగించడం చట్ట విరుద్ధం. ఆ ఉద్యోగికి ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సెలవులు ఎందుకు ఎక్కువగా తీసుకున్నారన్నదానిపై వివరణ తీసుకోవాలి. తరచుగా సెలవులు తీసుకోవడం లేదా అనారోగ్యం అనేది నేరుగా 'దుష్ప్రవర్తన' కిందకు రాదు. ఒకవేళ ఉద్యోగి దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల పని చేయలేకపోతుంటే, వారి మెడికల్ సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అన్నీ చూశాక ఉద్యోగిని తొలగించాలంటే కనీసం ఒకనెల నోటీసు పీరియడ్ లేదా అందుకు సమానమైన జీతాన్ని చెల్లించాలని ఇండియా లేబర్ లా చెబుతోంది. అనారోగ్యం కారణంగా తొలగిస్తే 'రిట్రెంచ్‌మెంట్' కిందకు రాదు, కాబట్టి ప్రత్యేక పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.

కేవలం సెలవుల కోటాను మించి సెలవులు తీసుకున్నంత మాత్రాన ఉద్యోగం నుండి తొలగించడం సాధ్యం కాదని సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ పార్టనర్ సౌమ్య కుమార్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. అయితే, ఉద్యోగి పనితీరు సంతృప్తికరంగా లేకపోయినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సెలవులు పెడితే మాత్రం అది తొలగింపునకు ఒక కారణంగా మారుతుందని ఆమె తెలిపారు. అన్ని సెలవులు అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు జీతం లేని సెలవులు తీసుకోవచ్చనే దానికి నిర్దిష్ట ఫార్ములా లేదు. ఇది ఆయా కంపెనీల పాలసీలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో సరైన డాక్యుమెంటేషన్ సమర్పించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story