- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Stamped: బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనకు సంబంధించిన కీలక వివరాలను కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర (G Parmeshwara) వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనకు సంబంధించిన కీలక వివరాలను కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర (G Parmeshwara) వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ కోసం దాదాపు 8 లక్షల మంది తరలివచ్చారని అన్నారు. అందుకే తొక్కిసలాట జరిగిందన్నారు. ‘‘విధానసౌధ బయట లక్ష మంది ఉంటారని అంచనా వేశాం. స్టేడియం వెలుపల 25 వేల మంది ఉంటారని భావించాం. 2.5 లక్షలమంది వస్తారని ఊహించలేదు. నిన్న 8.70 లక్షల మెట్రో టికెట్లు అమ్ముడయ్యాయి. అవన్నీ క్రికెట్ అభిమానులవే అనుకుంటే.. 8 లక్షల మంది తరలివచ్చినట్లు కౌంట్. క్రికెట్ ప్రోగ్రాం కోసం ఆ స్థాయిలో ప్రజలు గుమిగూడిన సందర్భాలు గతంలో లేవు. ఈ తొక్కిసలాట జరగకుండా ఉంటే.. ఇదో రికార్డులా ఉండేది. నేను ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ సంఘంతో మాట్లాడగా.. వారు తమ అభిప్రాయాలు చెప్పారు’’ అని మంత్రి వెల్లడించారు. అలాగే అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తాను అక్కడికి వచ్చినట్లు తెలిపారు. అయితే, గేట్ల దగ్గర ఎంతమంది చనిపోయారనే సమాచారం లేదన్నారు.
బెంగళూరు తొక్కిసలాట
ఇకపోతే, బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది చనిపోగా.. మృతులు 40 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. కాగా.. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. కాగా.. నిన్న తొలుత కర్ణాటకలో దిగిన ఆర్సీబీ జట్టుకు విధానసౌధలో సన్మానం జరిగింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టు సభ్యులను సన్మానించారు. అంచనాకు మించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో వెనక గేటు వద్ద తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి.






