PM KISAN YOJANA : పీఎం కిసాన్ యోజన పథకం అప్లై చేయండిలా..!

by Muthe.Rajitha |

రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) పథకం డబ్బులు త్వరలోనే నేరుగా రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి.

PM KISAN YOJANA : పీఎం కిసాన్ యోజన పథకం అప్లై చేయండిలా..!
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) పథకం డబ్బులు త్వరలోనే నేరుగా రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. 19వ విడుతకు సంబంధించిన మొత్తాన్ని ఫిబ్రవరిలో రైతుల ఖాతాలో జమ చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పథకానికి జనవరి 31లోగా కేవైసీ(KYC) చేయించుకున్న వారికి మాత్రమే.. ఈ పథకం కింద రూ.2000 వారి అకౌంట్లలో జమ అవుతాయి. pmkisan.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళి కుడి వైపున గల ఈ- కేవైసీ(e-KYC) క్లిక్ చేయాలి. ఆధార్(Adhar) నంబర్ ఎంటర్ చేయగానే.. దాని రిజిస్టర్డ్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్మిట్ చేస్తే.. కేవైసీ జత చేసినట్టే.

Next Story