APP: ఎన్నికల వేళ సంచలన పరిణామం.. తెరపైకి లిక్కర్ స్కాం కేసు

by Ramesh Goud |   (  Updated:2025-01-15 06:17:48  IST  )

APP: ఎన్నికల వేళ సంచలన పరిణామం.. తెరపైకి లిక్కర్ స్కాం కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ఢిల్లీ రాజకీయాల్లో(Delhi Politics) సంచలన పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case) మరో సారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Aravaind Kijrival), మనీష్ సిసోడియా(Maneesh Sisodia)లను విచారించేందుకు ఈడీకి అనుమతి లభించింది. దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆప్ నేత కేజ్రీవాల్, సిసోడియా సహా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని, కేజ్రీవాల్, సిసోడియాలను మరోసారి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కేంద్రాన్ని కోరింది. ఈడీ ప్రతిపాధనకు కేంద్రహోంశాఖ స్పందిస్తూ.. ఆప్ నేతలను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియాలు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగుతున్న వేళ లిక్కర్ స్కాం కేసు మరోసారి తెర మీదకి రావడం ఆసక్తికరంగా మారింది.

Next Story