- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరివంశ్ నారాయణ్‌కు అభినందనలు తెలిపిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
by Naga Rani Yarlagadda |
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ కు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలుపుతూ స్పీకర్ ఒక అధికారిక లేఖను రాశారు. హరివంశ్ నియామకం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన తన అనుభవంతో రాజ్యసభ హుందాతనాన్ని మరింత పెంచుతారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ తన బాధ్యతలను అత్యంత విజయవంతంగా నిర్వహించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.
Next Story






