‘నమో హ్యాట్రిక్’ హూడీతో పార్లమెంటులో కేంద్రమంత్రి

by Dishanational4 |
‘నమో హ్యాట్రిక్’  హూడీతో పార్లమెంటులో కేంద్రమంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో స్పెషల్ లుక్‌లో సందడి చేశారు. ‘నమో హ్యాట్రిక్’ అనే క్యాప్షన్‌తో కూడిన కాషాయ రంగు టీ షర్ట్‌ (హూడీ) ధరించి ఆయన శనివారం పార్లమెంటుకు వచ్చారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించగా.. తాను ధరించిన హూడీ గురించి వివరించారు. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రి కాబోతున్నారనే సందేశాన్ని అందరికీ బలంగా చెప్పేందుకే ఈ హూడీ ధరించి వచ్చానని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ‘‘ప్రధాని మోడీ ఎల్లప్పుడూ అభివృద్ధి ప్రస్థానం పక్షానే నిలబడతారు.. మూడోసారీ మోడీ సర్కారే వస్తుంది ... ఈసారి కూడా ఎన్డీఏ కూటమికి 400కుపైనే లోక్‌సభ సీట్లొస్తాయ్’’ అని ఆయన చెప్పారు. అనురాగ్ ఠాకూర్ ధరించిన హూడీపై బీజేపీ ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ.. ‘‘యావత్ భారతదేశ ప్రజలు ఇలాంటి హూడీలు ధరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భగవాన్ శ్రీరాముడు అందరి హృదయాలలో కొలువై ఉంటారు. అదేవిధంగా మోడీ జీ కూడా సకల జనుల హృదయాలలో నివసిస్తూ ఉంటారు’’ అని పేర్కొన్నారు.


Next Story

Most Viewed