- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో వాయు కాలుష్యం అరికట్టేందుకు యాంటీ-స్మోక్ గన్స్
ఢిల్లీ,ఎన్సీఆర్ ప్రాంతంలో వాయి కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీపావళి రోజున పేల్చిన క్రాకర్స్ కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దేశరాజధానిలో బూడిదరంగు పొగమంచు కురుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ,ఎన్సీఆర్ ప్రాంతంలో వాయి కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీపావళి రోజున పేల్చిన క్రాకర్స్ కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దేశరాజధానిలో బూడిదరంగు పొగమంచు కురుస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం గాలి పీల్చుకోలేని దుస్థితి ఏర్పడింది. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు యాంటీ స్మోక్ గన్స్ ను మోహరించి కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ రోజు ఉదయం 8గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇడెక్స్ AQI 338 పాయింట్స్ వద్ద ఉంది. చాలా ప్రాంతాల్లో AQI 300 పాయింట్లుగా నమోదైంది. గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.






