Anti-ship: నావల్ యాంటీ షిప్ క్షిపణి పరీక్ష సక్సెస్.. ఒడిశా తీరంలో ప్రయోగం

by B.Srinivas |

భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పరిశోధనా సంస్థ అయితే డీఆర్డీఓ సైన్యం కోసం తన సాంకేతికతను నిరంతరం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

Anti-ship: నావల్ యాంటీ షిప్ క్షిపణి పరీక్ష సక్సెస్.. ఒడిశా తీరంలో ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పరిశోధనా సంస్థ అయితే డీఆర్డీఓ (DRDO) సైన్యం కోసం తన సాంకేతికతను నిరంతరం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒడిశా (Odisha) తీరంలోని చాందీపూర్ (Chandipur) నుంచి భారత్‌లో తయారు చేసిన మొట్టమొదటి నావల్ యాంటీ షిప్ క్షిపణి షార్ట్ రేంజ్ (NASM-SR) ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఇండియన్ నావల్ సీ కింగ్ హెలికాప్టర్ నుంచి ఈ ప్రయోగం జరగగా షిప్ తన లక్ష్యాలన్నింటినీ చేదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షిపణిని సక్సెస్ ఫుల్‌గా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) డీఆర్‌డీఓ, భారత నావికాదళానికి అభినందనలు తెలిపారు.

ఈ పరీక్ష భారత నావికాదళానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే ఈ క్షిపణి ఏ శత్రు నావికా దళాన్ని అయినా సమర్థవంతంగా నాశనం చేయగల సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ క్షిపణి అత్యంత ప్రత్యేక లక్షణాలలో ఒకటి మ్యాన్-ఇన్-లూప్ లక్షణం కీలకమైంది. ఈ ఫీచర్‌తో పైలట్ మొత్తం విమానంలో క్షిపణిని నియంత్రించొచ్చు. కాగా, ఈ క్షిపణిని ఈ క్షిపణిని డీఆర్డీఓ రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ, టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీతో సహా వివిధ ప్రయోగశాలలు అభివృద్ధి చేశాయి.

Next Story