- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anti-Hindu parade: కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్థానీలు.. హిందువులను వెనక్కి పంపాలని నిరసన
కెనడాలో ఖలిస్థానీలు రెచ్చిపోయారు. కాగా.. కెనడా నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో ఖలిస్థానీలు రెచ్చిపోయారు. కాగా.. కెనడా నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులు భారత ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోన్‌లో పెట్టి ప్రదర్శించారు. కాగా.. వేర్పాటువాదులు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కవాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవలే ఖలిస్థానీ మద్దతుదారులు ఓ గురుద్వారా, మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిండా ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత ఇది. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణం’’ అని రాసుకొచ్చారు. కనిష్కా బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1985లో ఎయిర్ ఇండియా 'కనిష్కా' విమానంపై బాంబు దాడి జరింగింది. ఖలిస్థానీ వేర్పాటు వాదులు చేసిన ఆదాడిలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు.
కెనడా మీడియా..
కెనడాకు చెందిన విలేకరి డానియల్ బోర్డమన్ కూడా హిందూ వ్యతిరేకతను రెచ్చగొట్టేలా ఖలిస్థానీలు నిర్వహించిన కార్యక్రమం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఖలిస్థానీలపై చర్యలు తీసుకోవడంలో కొత్త ప్రధాని మార్క్ కార్నీకి.. మాజీ ప్రధాని ట్రూడోకు ఏమైనా తేడా ఉందా అని ప్రశ్నించారు. ఇది "సిగ్గుపడే రోజు" అని నార్త్ అమెరికా హిందూ గ్రూప్ పేర్కొంది. ప్రపంచమంతా దీన్ని చూస్తుందని పేర్కొంది. కానీ, కెనడా ప్రాంతీయ నాయకులు, జాతీయ సంస్థలు దీన్ని గమనిస్తున్నాయా అని ప్రశ్నించింది. మానవహక్కుల సంఘాలు లేదా మీడియాలు ఈ వార్తను కవర్ చేస్తాయా అని అడిగింది. ఇటీవలే సర్రేలో జరిగిన ఓ పరేడ్ లో ఖలిస్థాన్ జెండాలు, భారత వ్యతిరేక దృశ్యాలు కన్పించాయి. ప్రధాని మోడీ, అమిత్ షా ఉన్న "వాంటెడ్" పోస్టర్‌లను ప్రదర్శించారు. కాగా.. వైరల్ గా మారిన ఆ విజువల్స్ వల్ల ఆ కార్యక్రమం విమర్శలకు దారితీసింది.






