- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: తమిళనాడు కేసుపై అభిప్రాయం చెప్తాం.. తీర్పు ఇవ్వలేం: సీజేఐ బీఆర్ గవాయ్
తమిళనాడు కేసుపై తమ బెంచ్ అభిప్రాయం చెబుతుంది, కానీ తీర్పు ఇవ్వదని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించడానికి కాలపరిమితిని నిర్ణయించడంపై రాష్ట్రపతి సూచనలకు సమాధానం ఇవ్వడం తమిళనాడు కేసులో తీర్పును ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తమిళనాడు కేసుపై తమ బెంచ్ అభిప్రాయం చెబుతుంది, కానీ తీర్పు ఇవ్వదని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోపు తేల్చామని కోర్టులు ఆదేశించవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. తమిళనాడు తీర్పు సరైనదా కాదా అని మేము నిర్ణయించడం లేదు. రాష్ట్రపతి చేసిన సూచనకు మాత్రమే సమాధానం ఇస్తున్నామని స్పష్టం చేసింది. పిటిషన్‌ను విచారణకు తీసుకోవడంలోని అర్హతలను వింటామని సీజేఐ తెలిపారు. అందుకు సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వివరిస్తూ.. ఈ విషయంలో అనేక అంశాలు ఉన్నాయి. ఆర్టికల్ 200ను చూడాలని, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ కేసుల్లో 'సాధ్యమైనంత త్వరగా' అనే పదం కారణంగా జాప్యం జరుగుతోంది. తమిళనాడు కేసు కారణంగా గడువు విధించవద్దని కోరారు. దీనికి స్పందించిన సీజేఐ.. స్వయంగా రాష్ట్రపతి దీనిపై రెఫరెన్స్ అడిగారని, ఇందులో మీకున్న సమస్యేంటని ప్రశ్నించారు. సీనియర్ న్యాయవది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు విన్న అనంతర.. ఈ విషయంలో తాము అభిప్రాయం చెప్పగలం, తమిళనాడు కేసుపై తీర్పు ఇవ్వలేమని వెల్లడించారు.






