- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ansari: అబ్బాస్ అన్సారీ శాసనసభ సభ్యత్వం రద్దు.. యూపీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం
ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలడంతో ముక్తార్ అన్సారీ కొడుకు అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలడంతో ముక్తార్ అన్సారీ (Mukthar anasari) కొడుకు, ఉత్తరప్రదేశ్‌లోని మౌ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) కి యూపీలోని కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని అసెంబ్లీ రద్దు చేసింది. ఈ మేరకు స్పీకర్ సతీష్ మహానా అబ్సాస్‌ను అనర్హుడిగా ప్రకటించారు. కోర్టు తీర్పు వెలువడిన తేదీ నుంచి అంటే మే 31 నుంచి అన్సారీ సభ్యత్వం రద్దయినట్టు తెలిపారు. అయితే మౌ జిల్లా కోర్టు నిర్ణయాన్ని అన్సారీ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. కానీ సభ్యత్వం కోల్పోవడాన్ని మాత్రం సవాల్ చేసే చాన్స్ లేదు. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అబ్బాస్ అన్సారీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా అనర్హత వేటు పడటంతో మౌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. త్వరలోనే ఆ సెగ్మెంట్‌లో ఉప ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది.






