- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం.. గుండెపోటుతో తాత మృతి!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. మనవడి మరణం తర్వాత తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యం పాలైన కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మనవడు హత్యకు గురైనప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
స్నాప్‌చాట్ మెసేజ్ కీలకం..
ఇదిలా ఉండగా, కేతన్ హత్య కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు లభిస్తున్నాయి. కేతన్‌తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే నిందితురాలు సియా గోయల్ అతడిని వదిలించుకోవాలని పథకం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ‘‘అసలు జరగని పెళ్లి కోసం ఎంట్రీ టికెట్లు బుక్ చేస్తున్నా.. నీ ఆధార్ కార్డు పంపు’’ అంటూ సియా తన స్నేహితురాలికి స్నాప్‌చాట్‌లో పంపిన మెసేజ్ దర్యాప్తులో కీలకంగా మారింది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేకపోయినా.. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులు సియా, చేతన్‌లు పోలీసుల కస్టడీలో ఉన్నారు. కేసులో మరింత సమాచారం కోసం వీరిద్దరి ఫోన్ కాల్స్, చాట్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.






